ఇరాన్‌లో రెండు భారీ భూకంపాలు
250 మృతి.. 2 వేల మందికి గాయాలు
టెహ్రాన్: శనివారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఇరాన్‌ను కుదిపేశాయి. ఇరాన్‌లోని అజర్‌బైజాన్ ఫ్రావిన్స్‌లోని తాబ్రిజ్, అహర్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం ధాటికి 250 మందికి మృతి చెందారు. 6.4,6.3 తీవ్రతతో వచ్చిన రెండు భారీ భూకంపాలు 100కి పైగా గ్రామాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ భూకంపం ధాటికి 250 మంది మృతి చెందగా 2000కి పైగా క్షతగాత్రులు అయ్యారు. దాదాపు వేల మంది నిరాశ్రయులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్నారు. పదకొండు నిమిషాల్లో వ్యవధిలో సంభవించిన ఈ రెండు భూకంపాలు పెను విషౄదాన్ని మిగిల్చాయి. భూకంప కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని అహర్, హరీస్, వర్జాఖాన్ ప్రాంతాలలో గుర్తించారు. ఈ రెండు భూకంప కేంద్రాలు భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. 100 వరకు గ్రామాలు ధ్వంసం కాగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాయపడ్డ వారిని తాబ్రీజ్, అర్దెబిల్ ఆసుపత్రులకు తరలించారు. భూకంప ప్రకంపనల వల్ల జనం భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల దాటికి అహర్, హరీస్, వర్జాఖాన్ పట్టణాలు అతలాకుతలమయ్యాయి. అరవై గ్రామలు పూర్తిగా, పాక్షికంగా తుడిచి పెట్టుకు పోయాయి. మహిళలు, పిల్లల మృతదేహలు గుంపులుగా పడి ఉన్నాయి. తాబ్రిజ్ నగరంలో భవనాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు.