ఇసుక రవాణాని అరికట్టేందుకు గుర్తింపు కోసం మైనింగ్ సిబ్బందికి రెండు జతల కాకి బట్టల పంపిణీ
గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 15 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు గుర్తింపు కోసము మైనింగ్ సిబ్బందికి రెండు జతల కాకి బట్టలు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పంపిణీ చేశారు.బుధవారం కలెక్టర్ చాంబర్ లో ఏ డి మైనింగ్ శాఖ సిబ్బంది కి ఒక్కొక్కరికి రెండు జతల బట్టలు , బూట్లు, టోపీ, విసిల్ తదితర వస్తువులు పంపిణి చేశారు. శాండ్ రీచ్ లదగ్గర ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించడానికి వస్తే వారిని గుర్తించి అరికట్టేందుకు వీలుగా ఉంటుందని, సిబ్బంది అందరు శాండ్ రీచ్ ల్లో అక్రమ ఇసుక రవాణా జరుగ కుండ చూడాలని వారికీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏ డి మైనింగ్ అధికారి విజయ రామ రాజు, రవి కుమార్ రెడ్డి, గోపాల్, శ్రీనివాసులు, విజయ బాష్కర్, మహమూద్, దినేష్ తదితరులు ఉన్నారు.