ఈనెల 13 తారికున నుండి సిపిఐ ఆధ్వర్యంలో “తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ” వారోత్సవాలను జయప్రదం చేయండి

– సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి

కురవి సెప్టెంబర్ -10 (జనం సాక్షి న్యూస్)

భూమికోసం ,భుక్తి కోసం, వేట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74 వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.కురవి మండల కేంద్రం సిపిఐ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాటి భూస్వామ్య పెత్తందారి రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగిన తెలంగాణ సాయుధ పోరాటం చిరస్మరణీయమైనదని చారిత్రాత్మకమైన పోరాట ఘట్టాన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్న మతోన్మాద కుహనా లౌకిక వాదుల కుట్రలను తిప్పికొట్టాలని ,నాటి వీరోచిత పోరాటాలను స్మరించుకోవడానికి 74 వ సాయుధ పోరాట వార్షికోత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 15 వరకు “జీప్ జాత” నిర్వహిస్తున్నామని ఈ జాత విజయవంతానికి కార్యకర్తలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, నెల్లూరు నాగేశ్వరరావు, డోర్నకల్ మండల కార్యదర్శి తురక రమేష్ తదితరులు పాల్గొన్నారు.