ఈనెల 15న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

 

పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారిని తాల్క ప్రియాంక సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించి, ఉపాధ్యాయులకు, అంగన్వాడి కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాశాఖ నోడల్ అధికారి ఎన్.యాకయ్యతో కలిసి ప్రియాంక మాట్లాడుతూ మండలంలో ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు విద్యార్థిని, విద్యార్థులు 11,452 మంది ఉన్నారని తెలిపారు. నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని తెలిపారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ 19 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.