ఈనెల 25, 26న విద్యా సంస్థలకు సెలవులు
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ తేదీన ఆదివారం. ఈ రోజు సాధారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉన్న విషయం తెల్సిందే. దీంతో వరుసగా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు, ఆఫీసులకు సెలవులు రానున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, రిజర్వేషన్ కేటగిరీలలో ఉపవర్గీకరణలను అనుమతిస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగస్టు 21వ తేదీన (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వ్యతిరేకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మొదలవుతున్నాయి. భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ బంద్ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి. దీంతో ఆగస్టు 21వ తేదీ(బుధవారం) దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు జత కానుంది. దాదాపు 2024 ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు వరకు సెలవులు వస్తున్నాయి. ఇలా బంద్‌లు, భారీ వర్షాల, పండగల వల్ల స్కూల్స్, కాలేజీలకు ఎదో ఒక రూపంలో సెలవులు వస్తున్నాయి. ఇలా వరుసగా సెలవులు రావడం వల్ల స్కూల్స్, కాలేజీలు టీచర్లు సరైన సమయంలో విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన ఇలా వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.