ఈయూ, టీఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కార్మికశాఖ చర్చలు చేపట్టింది బస్‌భవన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ ప్రతినిధులతో కార్మికశాఖ అదనపు కమిషనర్‌ చర్చలు చేపట్టారు.