ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారి ఆధ్వర్యంలో పులిగుండం గ్రామాలలో నీ లబ్ధిదారులకు ఉచితంగా రాజశ్రీ కోళ్ల పంపిణీ చేయడం జరిగింది.
ఆగష్టు27 (జనంసాక్షి)
ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారి ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద పొట్లం పేట, జగ్గన్నపేట మరియు పులిగుండం గ్రామాలలో నీ లబ్ధిదారులకు ఉచితంగా రాజశ్రీ కోళ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి సీతక్క గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వ అధికారులు ముందుకు రావాలని వారికి శాసనసభ్యురాలుగా సహకారాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం వారు ఈ మారుమూల గ్రామాలను దత్తత తీసుకొని గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం చాలా సంతోషించదగ్గ విషయమని కొనియాడినారు కృషి విజ్ఞాన కేంద్రం మామ్నూరు ప్రోగ్రాం కోఆర్డినేటర్ Dr Rajanna ఈ పంపిణీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ ఈ రాజశ్రీ కోళ్ళు సుమారుగా ఐదు నుంచి ఆరు నెలల్లో గుడ్లు పెడతాయి అదేవిధంగా ఒక సంవత్సరకాలంలో 150 నుంచి 160 గుడ్లు పెడుతుంది ఇది మన దేశ వారి కోళ్ల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది అదేవిధంగా మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది మరియు ఇతర రోగాలని కూడా తట్టుకోవడానికి అనుకూలమైనటువంటి రకం దీనిని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు రూపొందించడం జరిగింది. ఈ లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో సుమారుగా 170 మంది లబ్ధిదారులకు ఈ కోళ్లను అదేవిధంగా దన పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు బి.యన్ రెడ్డి, రవీందర్, అరుణ జ్యోతి పాల్గొన్నారు వీటితో పాటుగా పోట్లాపూర్ మరియు జగ్గన్నపేట గ్రామ సర్పంచులు మరియు అభ్యుదయ రైతు రిటైర్డ్ టీచర్ అంజి రెడ్డి గారు మరియు ఉపసర్పంచ్ పాపయ్య గారు పాల్గొన్నారు