ఈ నిర్మాణంలో అనుమానాలు ఎన్నో అందిన కాడికి దొచుకుందేవరు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా ఉంటే శ్వేత పత్రం విడుదల చేయడానికి కంటోన్మెంట్ అధికారులకు ధైర్యం ఉందా అంటున్న బోర్డ్ ప్రజానీకం టౌన్ ప్లానింగ్ విభాగంలో 2006 కంటోన్మెంట్ చట్టం ప్రకారం కొంత మేరకు సవరణలు జరిగినప్పటికీ అధికారులకు అనుకూలంగా మారుతున్నాయని ఎన్నో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మాజీ బోర్డు సభ్యులు, తాజా మాజీ బోర్డు సభ్యులు ఏ నిర్మాణం వెనుక ఏ అస్మధీయులు ఉన్నారో వారికి ఏ మేరకు భారీ ఎత్తున అందుతున్నాయో ఈ నిర్మాణాలే ప్రత్యక్ష నిదర్శనం ఉదాహరణకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లో 8 వార్డులు ఉన్నప్పటికీ ఒకటో వార్డు ఆరవ వార్డు సమస్యాత్మకమైన వార్డులుగా గుర్తింపు పొందాయి అటు రాజకీయంలోనూ ఇటు అధికార బలంతోను ముడుపులతో ముప్పేట దాడి చేస్తున్నారు. భావన కాలనీ, సామ్రాట్ కాలనీ, రైల్వే జవహర్ నగర్ కాలనీ, ఇక్రిశాట్ ఫేస్ 2, ఈ కాలనీలలో జరుగుతున్న బహుళ అంతస్తులు భాగోతమే దీనికి నిదర్శనం ఇక్రిశాట్ ఫేస్ 2 లో జరుగుతున్న నిర్మాణం సక్రమమే??? ప్లాట్ నెంబర్ 1 లో కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారం భవనానికి ఒకే యూనిట్ ఉండాలని పొందుపరిచినప్పటికీ కంటోన్మెంట్ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతు ఏడు యూనిట్లు గా విభజించి విక్రయాలకు సిద్ధం అవుతుంది.. పేనుకు పెత్త నమిస్తే తలంతా కొరికినట్లుంది ఈ భవన నిర్మాణ భాగోతం జిహెచ్ఎంసి తరహాలో నిర్మాణాలు బహులా అంతస్తుల నిర్మాణాలు కంటోన్మెంట్లో నిషేధం అయినప్పటికీ అధికారులను మర్చక చేసుకుంటూ వారికి కావలసినది ఎర వేస్తూ తమ పనికి ఆటంకం లేకుండా సాఫీగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వచ్చిన అనుమతి ఏ మేరకు ఉన్నది ? అక్కడ నిర్మాణం ఎలా ఉన్నది
భౌతికంగా నిర్మాణం ఎలా ఉందో తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది ఈ నిర్మాణం పట్ల స్థానిక కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు. దీంతో అధికారుల వైఖరి పలు అనుమానాలకు తావిస్తుండడం అక్రమ నిర్మాణాలను యధేచ్చగా ప్రోత్సహిస్తు ఉండడం పరిపాటిగా మారింది..ఇదిలా ఉండగా ఇదే ఆరవ వార్డులో మరో అవినీతి లీలకు ఈ ఇనుప కడ్డీలా నిర్మాణమే పెద్ద నిదర్శనం,ఆరవ వార్డులో ఉన్న ఆర వెల్లి కాలనీలో పల్లవి స్కూల్ లో పెద్ద పెద్ద ఇనుప కడ్డీలతో అనుమతి లేకుండా భారీ ఎత్తున నిర్మాణం జరుగుతున్నప్పటికీ లోపాయికారికంగా అధికారులు ముడుపులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని అక్రమ నిర్మాణాలు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ వీళ్ళపై శాఖాపరమైన చర్యలు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చర్యలు ఏ విధంగా ఉండాయి అనేది కాలమే సమాధానం చెప్పనుంది.