ఈ నెల 27 న చలో కలెక్టరేట్ ముట్టడి చేద్దాం.

– తెలంగాణ మలమహనాడురాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు
దుబ్బాక 22, జూలై ( జనం సాక్షి )
జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర శాఖ తలపెట్టిన ఈ నెల 27న చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని తెలంగాణ మలమహనాడురాష్ట్ర కోఆర్డినేటర్. ర్యాకం శ్రీరాములుఒక ప్రకటనలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ మద్దతు పలికిన రాబోయే ఎలక్షన్లలో భూస్థాపితం చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు గానీ బిల్లు ప్రవేశ పెట్టడం గాని చేపడితే మరల అగ్రహానికి కల గర్భంలో కలిసిపోతారని ఆయన డిమాండ్ చేశారు. ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ ఏదో ఒక సమయంలో ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూ మాల మాదిగల మధ్య విభేదాలు గొడవలు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారని గ్రామీణ ప్రాంతాలలో మాల మాదిగలు కలిసి మెలిసి ఉంటున్న క్రమంలో ఇలాంటి ప్రకటన వల్ల ఎస్సీల మధ్యనే విభేదాలు ఏర్పడి గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుందని దీన్ని పాలక పక్షాలు అఖిలపక్షాలు ఎవరికి వారే రాజకీయాలు చేస్తున్నారని అందుకే ఏ బి సి డి వర్గీకరణకు ఎవరు ఏ పార్టీ మద్దతు పలికిన ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. అందుకే ఈనెల 27న అన్ని జిల్లాల కలెక్టరేట్లల్లో ధర్నాలు ఉన్నందున సిద్దిపేటజిల్లా అధ్యక్షులు.వెన్న.రాజు ఆధ్వర్యంలో.తెలంగాణ మాల.మహానాడు రాష్ట్రకోఆర్డినేటర్. ర్యాకం శ్రీరాములు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయనీకి జిల్లా నలుమూలల నుండి మాలలు మాలలా  అనుబంధం కులాల సంఘాల నాయకులు కలిసొచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.