ఉగ్ర దాడిపై మండిపడిన ప్రతిపక్షాలు

ఢిల్లీ : ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించినా తగిన భద్రతా చర్యలు తీసుకోక, ఉగ్రవాదుల దాడికి అవకాశమివ్వడం పట్ల కేంద్ర, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై భాజపా, ఇతర విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఇంటెలిజెన్స్‌ హెచ్చరించాక కూడా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచకపోవడం తీవ్రమైన విషయమని భాజపా ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటిన బుద్ధుని అలయం ఉగ్రదాడికి గురికావడం దారుణమన్నారు. జరిగిన దుర్ఘటనను భాజపా ఖండిస్తోందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జవదేకర్‌ తెలిపారు. రాంవిలాస్‌ పాశ్వాస్‌ కూడా బుద్ధగయ సంఘటనను ఖండించారు.