ఉత్తర కాశీలో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖపట్నం : ఉత్తర కాశీలో చిక్కుకున్న తమ బంధువుల క్షేమ సమాచారం కోసం విశాఖవాసులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కైలాసగిరి ప్రధాన అర్చకుడు కాశీబాబు శర్మ దంపతులు, బంధువులు ఉత్తర కాశీకి 15కిలో మీటర్ల వద్ద కొండ ప్రాంతంలో చిక్కుకున్నారు. తన తండ్రి నుంచి చివరిసారిగా సోమవారం సాయంత్రం 6గంటలకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఆ తర్వాత వారి సమాచారం తెలియలేదని కాశీబాబు కుమారుడు కొత్తలంక అవినాష్‌ శర్మ తెలిపారు. తమ తల్లిదండ్రులతోపాటు, పిన్ని, బాబాయ్‌, అత్తయ్‌, అత్తయ్య, మామయ్య కూడా ఈ యాత్రకు వెళ్లారని చెప్పారు. ఈ నెల 4న విశాఖ నుంచి రైల్లో బయలుదేరి, అక్కడి నుంచి ట్రావెల్స్‌ బస్‌లో ఛారదమ్‌ యాత్రకు వెళ్లారు. కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రీలలో యాత్రను పూర్తిచేసుకుని, యమునోత్రికి వెళ్తుండగా…. ఉత్తర కాశీకి 15 కిలోమీటర్ల దూరంలో భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమవారికి తాగునీరు, తిండి సదుపాయం గత మూడు రోజులుగా అందదేదని, ప్రభుత్వం ఇప్పటికైనా తమవారిని అదుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బంధవులు కోరుతున్నారు.