ఉపాధి పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తూప్రాన్ (జనం సాక్షి )జూన్ :: మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని శ్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం శక్తిగా ఉపాధి పథకాలను ఎంచుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని మనోహర్ మండల ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మనోహర్ బాద్ మండలంలోని కాళ్ళ కల్ గ్రామంలో శ్రీనిధి బ్యాంకు ద్వారా కిరాణా దుకాణం టీ స్టాల్ ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు శ్రీనిధి బ్యాంకు ద్వారా మహిళలకు రుణాన్ని ఇస్తుందని అట్టి డబ్బులతో ఏదో ఒక వ్యాపారం ఎంచుకొని ప్రారంభించాలని తెలిపారు మహిళలతోనే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పథకాలు కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటీఎం పెంటా గౌడ్ సి సి కృష్ణవేణి ఎంపిటిసి లావణ్య మల్లేష్ సర్పంచ్ మల్లేష్ నాయకులు మహిళలు పాల్గొన్నారు



