ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
రంగశాయిపేట,(జసంసాక్షి) నగరంలోని దేశాయిపేట రోడ్డులోని ఏకశిలనగర్‌లో తాళంవేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది ఇంతేజార్‌గంజ్ సీఐ బీవీ సత్యనారాయణ కధనం ప్రకారం ఏకశిలనర్‌లో నివాసయుంటున్న
చిక్కుల్లపల్లి రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి వృత్తిరీత్యా మొగుళ్లపల్లిలో ఉపాధ్యాయులుగా పని చేసేందుకు వెళ్లగా అదే రాత్రి ఇంట్లో చోరీ జరిగింది ఇంట్లోని బీరువాలో ఉన్న పది హేడున్నర తులాల బంగారు ఆభరణాలు ఇరువై తులాల వెండి వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లారు బాదితురాలి ఫిర్యాదు సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రజలు తాళం వేసి బయటకెళ్లిన సమయంలో ముందు తలువులకు పరదా వేసు కోవాలని ప్రధానం గేటుకు లోపలి భాగం నుంచి తాళం వేసుకోవాలని బీవీ సత్యనారాయణ సూచించారు.