ఉపాధ్యాయులు సర్దుబాటు సరికాదు

తిరుపతి,జనవరి28(జ‌నంసాక్షి): విద్యా సంవత్సరం చివర్లో పని సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను వేధించాలని ప్రభుత్వం చూస్తోందని దీనిని మానుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పేరిట ఉపాధ్యాయులను అదనంగా గుర్తించి భవిష్యత్తులో ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌ చేయకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఒక సంక్షేమ రంగంగా కాకుండా ఒక వ్యాపార, పునరుత్పాదక రంగంగా చూస్తోందన్నారు. దీనిని విరమించుకోవాలని కోరారు. సిపిఎఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని కోరుతు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసిన ప్రభుత్వం ఒంటెద్దుపోకడలు అవలంబిస్తోందన్నారు. వెంటనే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. పండిట్‌, పిఇటి పోస్టులు వెంటనే అప్‌గ్రేడ్‌ చేసి వెంటనే ప్రమోషన్లు యివ్వాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిమాండు చేశారు.