ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు లక్ష్మణ్ నాయక్ ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామీకం

ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు లక్ష్మణ్ నాయక్ ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామీకం

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పర్యటనలో భాగంగా టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ను టేకులపల్లి పోలిసులు
అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడం అప్రజా స్వామీకమని టి ఎస్ టి టి ఎఫ్ మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అణచివేత ధోరణి అవలంబిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం,ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఒప్పుకోవడమే,ప్రజా విశ్వాసం కోల్పోవడమేనని ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ,ఉపాద్యాయుల ప్రెండ్లీ ప్రభుత్వం కాదని, ఐ ఆర్, పి ఆర్ సి ల పేరిట ఉద్యోగ,ఉపాధ్యాయులను ఊరిస్తూ ఏం ఇవ్వకుండ ఎన్నికల్లో వెళ్లిపోవాలని చూస్తుందని అన్నారు.
నిరుద్యోగులను ఊరిస్తూ లేకలేక ఇచ్చిన నోటిఫికేషన్ లు,రాసిన పరీక్షలను కోర్టులు రద్దు చేయడం చూస్తే,నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ది ఎంత ఉందో అర్థం అవుతుందని అన్నారు.
ముందస్తు అరెస్ట్ లతో నాయకుల నోరు ఒక్క రోజు ఆపగలరు గాని,మిగత రోజులు ఎలా ఆపగలరని ప్రశ్నించారు. అరెస్ట్ ఆపి ప్రజా సంక్షేమం,విద్య వైద్యం మీద దృష్టి పెట్టండని హితవు పలికారు.
అక్కరకు రాని పథకాలు వందల్లో పెట్టి ప్రజా ధనాన్ని ఆగం చేసే కంటే నాణ్యమైన విద్య,వైద్యం ఉచితం ఇస్తే ప్రజల జీవితం బాగుపడ్డట్టేనని అన్నారు.
గత ఇరవై,పదిహేడు రోజులుగా సమ్మే చేస్తున్న అంగన్ వాడి టీచర్లు,ఆయాలు,ఆశ వర్క్లు,సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు