ఉపాధ్యాయ సంగాల జెఎసి ఏర్పాటు

సమస్యలపై పోరాడాలని నిర్ణయం

19నుంచి 24 వరకు ఆందోళనలకు పిలుపు

విజయవాడ,అక్టోబర్‌11 (జనం సాక్షి)

తమ సమస్యలు పరిష్కరించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు, పీపీఎస్‌, సీపీఎస్‌ యాప్‌ల రద్దు వంటి సమస్యలపై దశలవారీగా ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి.  జేఏసీలపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులు సొంత బాటలో పయనించాలని నిర్ణయించారు. పోరాడితే పోయేదేవిూలేదని నిర్ణయానికి వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి సమావేశంలో దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.జేఏసీలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి వారితో కలిసి నడిచినా ఉపయోగం లేదని భావించిన ఉపాధ్యాయ సంఘాలు సొంత ఎజెండాకు సిద్ధమయ్యాయి. సంయుక్త కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఫ్యాఎª`టో చెబుతుండగా ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య తమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 24 తేదీ వరకు ధర్నాలు, ఆందోళనలతో పాటు.. నవంబర్‌ 2న ఏకంగా ఛలో విజయవాడకు పిలుపు నిచ్చింది. ఖాళీ అవుతున్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం, ప్రతి నెల జీతాలు 7వ తేదీ వరకు రాకపోవడం, సర్వీస్‌ నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. కనీసం చర్చలకు కూడా పిలవలేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోరుబాట పట్టాలని నిర్ణయించామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు తెలిపారు.