ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వినోద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఉద్యోగి పీఆర్సీ పై ప్రకటనలు విడుదల చేయడం తప్ప పూర్తి స్తాయిలో పీఆర్సీని ఇవ్వడం లేదని అన్నా రు. ముఖ్యంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు పర్చాలని గతంలో ఉద్యమాలు చేసిన కుంటి సాకులతో ప్రభుత్వం సీపీఎస్‌ ఉ ద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు వెంటనే చేపట్టాలని డీఈవో, ఎంఈవె పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ అంశాన్ని తొందరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయ పదోన్నతుల పక్రియను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాని కోరారు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పొస్టుల ను పదోన్నతులతో భర్తీ చేయాలని కోరారు. టీఆర్‌టీ అభ్యర్థుల్లో నియామకాల అనంతరం మెరిట్‌లో ఉన్న వారితో ఖాళీల భర్తీని చేపట్టాలని కోరారు. పాఠశాలల మూత నిర్ణయం వల్ల నిరుపేదలు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉన్నందున ఆ ప్రతిపాదనను విరమించాలన్నారు. 302జీవోను పునరుద్ధరించి 40శాతం జేఎల్‌ పదోన్నతులు కల్పించాలన్నారు. 69శాతం ఫిట్‌ మెంటుతో 2018 జూలై 1నుంచి పీఆర్సీని అమలుచేయలన్నారు.