ఉప్పొంగిన జాతీయ భావం..!
ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ..!!
జాతీయ జెండాలు చేబూని నినాదాలు..!!!
మిర్యాలగూడ. జనం సాక్షి.
స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ.. జాతీయ భావం ఉప్పొంగుతోంది.. ఎవరికి వారు జాతీయ భావం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుండగా ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ భావం పట్ల,దేశం పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. మిర్యాలగూడ లోనే సీతారాంపురంలో గల చిన్న మసీదు నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు మహిళలు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ జాతీయ జెండాలను చేబూని భారత్ మాతాకు జై.. జాతీయ సమైక్యత వర్ధిల్లాలి.. జాతీయ పోరాట నాయకులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ సమైక్యతకు సంబంధించిన పాటలు ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. మహాత్మా గాంధీ విగ్రహం ముందు జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ సమైక్యతకు,శాంతియుత మార్గాలకు ముస్లింలు ముందుంటారని మతపెద్దలు పేర్కొన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు సందర్భంగా భారతీయులుగా గర్వపడుతూ పోరాట యోధులను స్మరించుకునేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముక్తి మహమ్మద్ ఇమ్రాన్ చావుస్, మీనా కళాశాల చైర్మన్ మహిముద్ కౌన్సిలర్లు జానీ ఇలియాస్, సలీం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు షోయబ్,, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, సీనియర్ జర్నలిస్టులు అస్లాం, హమీద్ అయూబ్, మాజీ వైస్ చైర్మన్ మగ్దూం పాషా తదితరులు పాల్గొన్నారు.