ఉమ్మడి కోటగిరి మండలంలో రెండవ రోజు కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమం.ఉమ్మడి కోటగిరి మండలంలో రెండవ రోజు కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమం.
కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలపై సమర శంఖం పూరిస్తూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజక వర్గంలోని ఉమ్మడి కోటగిరి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గన్నరం,లింగాపూర్, కొత్తపల్లి,బస్వాపూర్ గ్రామాలలో కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రకి టీపీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజక వర్గ ఇంచార్జ్ కాసుల బాల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా కాసుల బాల్ రాజ్ ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జండా ఆవిష్కరణ చేసి రెండో రోజు ప్రతి గడప గడపకు వెళుతూ హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం కొనసాగించారు.ఈ యాత్రను ఉద్దేశించి కాసుల బాల్ రాజ్ మాట్లాడుతూ.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,ప్రజా సమస్యలు తీరాలంటే తిరిగి అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమన్నారు.ఏవైనా సమస్యలు ఉంటె వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగనే పరిష్కరిస్తామని అన్నారు.రైతులకు అండగా ఒకేదఫలో రెండు లక్షల రుణమాఫినీ చేస్తామని పేర్కొన్నారు.కావున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెల్పించలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కోరారు.ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు హన్మండ్లు,నిజామాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులు గంగా ధర్ దేశాయ్,నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యద ర్శిలు కొట్టం మనోహర్,హన్మంత్,బాన్సువాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్,బీర్కూర్ మండల అధ్యక్షులు బోయిని శంకర్,సుంకిని మాజీ సర్పంచ్ మల్లుగొండ,వహీద్,సాయిలు,బాల్ రామ్,బస్వాపూర్ శ్రీను,రాంచందర్,గుమ్మడి రమేష్,జై రామ్ రెడ్డి, లింగం అప్ప,జుబేర్,ఉషం భుమ్మన్న ,రమేష్, నర్సింలు,దిల్దార్ రాములు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.