ఉమ్మడి జిల్లాలో సభ కోసం అన్వేషణ

నేడో, రేపో ఖరారు కానున్న సభాస్థలం
వరంగల్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాలతో ఎన్నికల సభను నిర్వహిస్తామని తెలంగాణ భవన్‌ విడుదల చేసిన ప్రకనటలో స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో 2014 ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా మడికొండలో భారీ బహిరంగసభ నిర్వహించి అభ్యర్థులను పరిచయం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని కోరారు. అదే క్రమంలో ఈసారి సభ ఎక్కడ నిర్వహించాలి? గతంలో అచ్చి వచ్చిన అదే మడికొండలో నిర్వహించాలా? లేక మరో ప్రాంతంలో నిర్వహించాలా? అన్న విషయాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్లాలని, అందుకోసం జనాకర్షక, ప్రగతి దిక్సూచి గల మేనిఫెస్టో రూపొందుతున్న వాతావరణానికి తోడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తొలిదశ ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంగా బహిరంగ సభలు నిర్వహించాలని భావించారు.  కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ సహ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తులతో చిత్తయిపోతున్నాయి. మహాకూటమి పొత్తులతో ఎటూ తేల్చుకోని స్థితిలో ఎవరికి ఏ సీటు
అన్న విూమాంసతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార పర్వాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తెలంగాణ భవన్‌ నుంచి కావాల్సిన ప్రచార సామగ్రి ఆయా నియోజకవర్గాలకు చేరింది.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరనున్నారు. అధినేత పై భారం వేసిన అభ్యర్థులు ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ము మ్మరం చేశారు. తమ అధినేత ఒకసారి వచ్చి బహిరంగ సభ నిర్వహించిపోతే ఆ వేడి, ఆ స్ఫూర్తి తమకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నాయి.