ఊరంతా పండుగఊరంతా పండుగకేసిఆర్ పుట్టినరోజు వేడుక – వినూత్నంగా,ఘనంగా నిర్వహించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి
యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
కే.సి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తన స్వగ్రామం లింగాపూర్ లో కే.సి.ఆర్. పుట్టినరోజు వేడుకను ఒక రోజు ముందుగా వినూత్నంగా ,ఘనంగా ఊరంతా పండుగ పేరుతో నిర్వహించి కే. సి.ఆర్ పైన అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామ ప్రజలందరు ఏకమై సుమారు 20,000, బెలూన్లు గాలిలో ఎగరవేసి కే.సి.ఆర్ ప్రవేశపెట్టిన పథకాలని అభివృద్ధిని సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు బెలూన్ల సహాయంతో నింగిలోకి ఎగరవేసి కే.సి.ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.దేశ్ కి నేత కే.సి.ఆర్సల్లంగుండు బిడ్డా కే.సి.ఆర్ , వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పల్లె ప్రజలు దీవెనలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పోరాటాల గడ్డపైన ఉద్భవించిన వీరపుత్రుడు, స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు,బంగారు తెలంగాణ కోసం పాటుపడుతూనే భారత భవిష్యత్తుని తీర్చిదిద్దుటకి కంకణం కట్టిన కారణ జన్ముడు గా కే.సి.ఆర్ ని అభివర్ణించారు. భవిష్యత్తులో తప్పకుండా భారత దేశానికి కే.సి.ఆర్ వల్ల, బిఆర్ఎస్ పార్టీ వల్ల మంచిరోజులు వస్తాయన్నారు. భారత దేశ రైతులకు మంచిరోజులు రాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ, సుగుణ, సువర్ణ, లలిత, బుచ్చమ్మ, హర్ష, వెంకటేష్, శేఖర్, లక్ష్మణ్, సాయి, నర్సమ్మ, సరిత, రమ, రాజమ్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.