ఊరు-మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
టౌన్ జనం సాక్షి
జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద  చేపట్టిన  పనులను
వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను  ఆదేశించారు.
శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  విద్యాశాఖ మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి పనుల పురోగతిపై సమీక్షించారు.
 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వారిగా ఇప్పటివరకు పూర్తి అయిన పనులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు, ఇంకా  ప్రారంభం కాని పనులు, టెండర్ ప్రక్రియలో ఉన్న పనులు,జాప్యానికి గల కారణాలు, తదితర అంశాలపై  సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏజెన్సీలు,విద్యా శాఖ అధికారులతో  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మనబడి ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని  ,ఆయా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.పురోగతిలో ఉన్న పనులు వారంలోగా   పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయాలని, టెండర్ స్టేజీలో ఉన్న పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కావాలని ఇంజనీరింగ్ శాఖాధికారులను ఆదేశించారు.
పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంది, కొండాపూర్, జిన్నారం, హత్నూర, న్యాల్కల్ మండలాల్లో మన ఊరు మనబడి పనులు పూర్తి చేసిన సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. ఆయా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ఏజెన్సీల తో సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా విద్యాధికారి రాజేష్ కు ఆదేశించారు.మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేసే ప్రతీ పనికి  సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో  రాజీ పడవద్దన్నారు.అన్ని పనులకు సంబంధించి వచ్చేవారంలోగా  పురోగతి ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి  నాంపల్లి రాజేష్, పంచాయతీ రాజ్ , ఆర్ అండ్ బి, టి.ఎస్.ఈ.డబ్యూ. ఐ.డి.సి, ఇరిగేషన్ , పబ్లిక్ హెల్త్ శాఖల ఈ ఈ లు ,ఆయా ఇంజనీరింగ్ శాఖల డి.ఈ.ఈ.లు,తదితరులు పాల్గొన్నారు.