ఊరూవాడా ఘనంగా గణెళిశ్‌ నవరాత్రి వేడుకలు

వివిధ రూపాల్లో గణెళిశ విగ్రహాల ఏర్పాటు

పూజల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌, మంత్రులు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనేకచోట్ల వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. ఊరూవాడా గణెళిశ్‌ ఉత్సవాలు ఘనంగా మొదల య్యాయి. వివిధ రూపాల్లో ఏర్పాటుచేసిన విగ్రహాలనుప్రత్యేక పూజలతో గణపయ్యను కొలుస్తున్నారు. మంటపాలను ఏర్పాటు చేసి పోటాపోటీగా వినయాక పూజలు మొదలు పెట్టారు. ప్రగతిభవన్‌లో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ వినయాకుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వినాయకున్ని కోరుకున్నారు. ఈ

పూజకు మంత్రి కేటీఆర్‌ కుటుంబసమేతంగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతి పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలుత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు స్వహస్తాలతో రూపొందించిన 75 అడుగుల కండువా, జంజాన్ని స్వామి వారికి సమర్పించారు. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన 75 అడుగుల గరిక మాల అలంకరించారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత తొలిపూజ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సప్తముఖుడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవం జరిగింది. శిల్పి రాజేంద్రన్‌ సమర్పించిన 50 కిలోల లడ్డూ ప్రసాదాన్ని బొజ్జ గణపయ్య చేతిలో అలంకరించారు. ఖైరతాబాద్‌ మహా గణపతిని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణెళిష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నాయిని నర్సింహారెడ్డిని సన్మానించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణెళిశున్ని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున పండగలన్నింటిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయక మ¬త్సవాలకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. 64 ఏళ్లుగా మహాగణపతి వేడుకలు జరుపుతున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహాగణపతికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నరు. పండుగలు దేశ సంస్కృతి వైభవానికి, ఐక్యతకు నిదర్శంనం కావాలన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ లో పర్యటించిన ఆయన వినాయక్‌ చౌక్‌ లో ఏర్పాటు గణెళిశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌ రెడ్డిని గణెళిష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు. గణెళిష్‌ ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహాయ సహకారులు ఉంటాయని మహేందర్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మాంగారి మఠంలో ప్రతిష్టించిన కర్ర వినాయకునికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం మంత్రిని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. వరంగల్‌లో వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలోని భారీ సీతాఫలంతో వేసిన సెట్టింగ్‌ వినాయకుడి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మేయర్‌ నరేందర్‌ నివాసంలో హరితహారం స్ఫూర్తిగా గణనాధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణెళిషుడు మొక్క నాటుతుండగా.. మూషికం నీళ్లు పోస్తున్నట్టుగా ఏర్పాటు చేసిన ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. మేయర్‌ నన్నపునేని నరేందర్‌ దంపతులు గణెళిశుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గణెళిష్‌ నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద జై గణెళిష్‌ నినాదాలు మార్మోగాయి. వివిధ రూపాల్లో ఏర్పాటుచేసిన మట్టి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అటు కొత్తగూడెంలోని గణెళిష్‌ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ దంపతులు గణెళిష్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు చేశారు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంతవైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మండపాలను అందంగా ముస్తాబు చేసి విఘ్నేశ్వరుని ప్రతిమలు నెలకొల్పారు. ప్రత్యేక పూజలు చేస్తూ గణనాథుని సేవలో తరించిపోతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వెరైటీ గణనాథులు కొలువుదీరాయి.

నగరంలోని పోచమ్మగల్లీలో మొక్కజొన్నలతో రూపొందించిన 60 అడుగుల గణెళిష్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు చేశారు. అటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 36 అడుగుల మట్టి వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. సురభీ కాలనీలోని చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యవరణ హితకారిగా నెలకొల్పిన ఈ విఘ్నేషుడి మూర్తిని ప్రజలు.. భారీగా దర్శించుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మొక్కులు తీర్చుకుని పునీతులవుతున్నారు.మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ప్రాంతంలోని కార్మికవాడలలో గణపయ్య పూజలందుకుంటున్నాడు. సింగరేణి వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో మార్కెట్‌ చౌరస్తాలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు చేసారు. అటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ పిండితో వినాయక విగ్రహాన్ని తయారు చేసారు. జలచర జీవులకు ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 108 కిలోల పిండితో ఐదున్నర అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్లు విద్యార్థులు చెప్పారు. గణెళిష్‌ నవరాత్రి ఉత్సవాల కోసం హైదరాబాద్‌ లో 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్‌ చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. రాత్రి వేళల్లో భక్తుల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.