ఎం.ఇ.ఎఫ్.ఐ అధ్వర్యంలో శిక్షణ తరగతులు

నాచారం (జనంసాక్షి) : మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 29 30 తేదీల్లో మల్లాపూర్ లోని ఎస్ ఎల్ ఎన్  గార్డెన్లో జరుగుతున్న ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్  మీడియా పాత్రికేయుల శిక్షణా తరగతులకు ఆయా ప్రాంతాల్లోని జర్నలిస్టులు
 తప్పకుండా హాజరూ కావాలని తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్   (TUWJ-IJU)    రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, మల్కయ్య లు
తెలిపారు. మేడ్చల్ జిల్లా   అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బాలరాజులు పర్యవేక్షణ లో జరిగే  తరగతుల్లో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి , నేతలు బేతి సుభాష్ రెడ్డి, తుల వీరేందర్ గౌడ్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ సెక్రటరీ నరేందర్ రెడ్డిలు పాల్గొంటారు.   ఈ శిక్షణ తరగతులో వివిధ అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజుల చక్రధర్, v6 కరస్పాండెంట్ బుచ్చన్న, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈ నాడు మాజీ పాత్రికేయులు సీనియర్ జర్నలిస్ట్ గోవింద రెడ్డి తదితర అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ తరగతులను ఇవ్వనున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు జిల్లా కమిటీ నాయకులు అక్బర్, నాచారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాపారావు, కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.