ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్‌ రావు


ప్రకటించిన సొసైటీ కమిటీ
హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఎగ్జిబిషన్‌ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తన విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తా. 80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్టియ్రల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దాం. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని హరీశ్‌రావు తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి, ఇతర పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదవిలోకి మంత్రి హరీశ్‌ రావు నియమితులయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్‌ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. అందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు.