ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా తెలంగాణ

కరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి
జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించాం
ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021`22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021`22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లనీ, దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.
రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయనిమంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు.
గతేడాదిలోనే లక్షన్నర ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయని మంత్రి తెలిపారు. కరోనా ఉన్నా కూడా హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు పెరిగాయని పేర్కొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు. జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ సాధించాం. వన్‌ ప్లస్‌ కంపెనీ హైదరాబాద్‌లో టీవీలు తయారుచేస్తోందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని తెలిపారు. ఈ నెల 20న టీహబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడిరచారు. టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.