ఎనుమాముల పత్తి మార్కెటలో కొనసాగుతున్న ఆందోళన
వరంగల్ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో మూడో రోజు కూడా పత్తి రైతుల ఆందోళన కొనసాగుతోంది. మార్కెట్‌కు 50 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అయితే పత్తి కొనుగోళ్లు మందకోడిగా సాగుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.