ఎన్నికలకు మరో మూడు నెలలే గడువు

కొత్త సంవత్సరంపై ప్రజల్లో కొగ్రొత్త ఆశలు
మోడీ విజయాలకన్నా వైఫల్యాలే ఎక్కువ
న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మరో రెండురోజుల్లో 2018 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనున్నది.  మోడీ అధికారం చేపసట్టేముందు ప్రజలకు అనేక ఆశలు కల్పించినా వాటిని నెరవేర్చ లేకపోయింది. అలాగే తన ప్రోగ్రెస్‌ రిపోర్టును ప్రజల ముందుంచుతానని 2014లో అధికారం చేపట్టే ముందు ప్రకటించిన మోడీ ఏ మేరకు తమ విజయాలను చూపుతారో చూడాలి. ఈ ఐదేళ్ల పాలనా కాలంలో ప్రధానంగా ఆర్థికరంగంలో మోడీ సర్కారు వైఫల్యానికి, ప్రజలపై మోపిన భారాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలం కావడం వెనక నోట్ల రద్దు, జిఎస్టీ ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ ఇప్పటి వరకూ చేసిన ప్రకటనలన్నీ వాగాడంబరాలేనన్న విషయం స్పష్టమైంది. రెండేళ్ల క్రితం రు.500, రు.1000 నోట్లను రద్దు చేస్తూ ఇది నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేపడుతున్న చర్య అని మోడీ ప్రకటించారు. ఈ చర్య ద్వారా దాదాపు 3,4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయట పడుతుందని ఆయన చెప్పారు. రద్దయిన నోట్లలో  99.3 శాతం నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అంటే ఈ నోట్ల రద్దు వల్ల ఒరిగిందేవిూ లేదని తేలిపోయింది. ఏటా పదికోట్ల ఉద్యోగావ కాశాలు కల్పిస్తామని, అచ్ఛేదిన్‌ ముందున్నాయని 2014లో మోడీ చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగాలాయి. మోడీ సర్కారు అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ, యువతకు నిరాశా నిస్పృహలే మిగిలాయి. గత 20 ఏళ్లకాలంలో పోలిస్తే విద్యావంతులైన యువత ఇప్పుడు అత్యధికంగా వున్నారని తాజా సర్వేలో వెల్లడయింది.  వ్యవసాయరంగ సంక్షోభం నానాటికీ విస్తరిస్తుండ టంతో రైతులు, గ్రావిూణ పేదల వెతలు పెరుగుతున్నాయి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు రైతులుపం డించిన పంటలకు కనీస మద్దతు ధర అందిస్తామన్న మోడీ సర్కారు ప్రకటనలోని డొల్ల తనం బయటపడింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ నేతల ప్రకటనలు, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతాంగాన్ని గట్టెకంకించలేకపోయింది.మోడీ సర్కారు హయాంలో తీవ్ర సంక్షోభానికి గురైన మరో రంగం బ్యాంకింగ్‌ రంగం.. ఈ రంగంలో ఎన్‌పిఎలు పెరిగి బ్యాంకులు అందచేసిన రుణాలలో 12 శాతానికి చేరుకుంటున్నాయి. బడా వ్యాపారవేత్తలు, పెట్టుబడి దారులకు అందచేసిన రుణాల రికవరీకి చేసిన ప్రయత్నాలు నిష్పయ్రోజనం కావటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రు.1.44 కోట్ల పారుబకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. బడా వ్యాపార వేత్తలు భారీయెత్తున రుణాలను ఎగవేసేందుకు అవకాశం కల్పించటం కారణంగా వారు దేశాన్ని విడిచి పారిపోయారు. ఇకపోతే  రాఫెల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీ ఆఫ్‌సెట్‌ కాంట్రాక్ట్‌ ద్వారా భారీయెత్తున అనుచిత లబ్ది పొందినట్లు వస్తున్న ఆరోపణలపై పస్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వటం లేదు. 2016లో సంతకాలు చేసిన తాజా రాఫెల్‌ ఒప్పందంలో భాగమైన ఈ కుంభకోణం ఫ్రెంచ్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హాలెండే చేసిన వ్యాఖ్యలతో 2018లో వెలుగు చూసింది. ఫ్రెంచ్‌ సంస్థ డస్సాల్ట్‌ కంపెనీకి భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామ్య సంస్థగా అనిల్‌
అంబానీ సంస్థను మోడీ సర్కారు ఎంపిక చేసిన విధానం వస్తున్న విమర్శలకు మోడీ నేరుగా సమాధానం ఇవ్వడం లేదు.గత ఎన్నికల్లో తనను తాను అవినీతిపై పోరాడే యోధుడిగా ప్రకటించుకున్న నరేంద్రమోడీ ప్రతిభ ఈ కుంభకోణంతో మసకబారి పోయింది.  ఏడాదిలోనే మోడీ సర్కారు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులను ముమ్మరం చేసింది. రాజ్యాంగ విలువలను కాలరాసింది. ఈ ఏడాది ఆరంభంలో సుప్రీంకోర్టుకు చెందిన  నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు బయటి వ్యవస్థలు న్యాయవ్యవస్థ సమగ్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ విూడియా కెక్కారు. ఈ ఏడాది చివరిలో తమకు అనుకూలురైన వంది మాగధులకు బాధ్యతలప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్‌కు ఉద్వాసన పలికారు. అదే విధంగా మిగులు నిధులను అప్పగించాలంటూ ప్రభుత్వ పెద్దలు రిజర్వ్‌ బ్యాంక్‌పై వత్తిడి పెంచటంతో బ్యాంకు గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో ఆరెస్సెస్‌-బిజెపి కూటమి మరోసారి అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. ఈ ఏడాదిలో ప్రాధాన్యత సంతరించుకున్న మరో అంశం రైతాంగ, కార్మిక ఉద్యమాలు, పోరాటాలు.. ఈ ఏడాది ఊపందుకున్నాయి. గత మార్చిలో మహారాష్ట్రలో నాసిక్‌ నుండి ముంబయి వరకూ రైతులు తలపెట్టిన లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమం ఇందులో ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన రైతుల మహాధర్నా ప్రభుత్వంపై ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబించాయి.  బిజెపికి గట్టి పట్టున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమికి ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి కారణంగా చూడాలి. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న సమయంలో బిజెపిపై పోరుకు, మోడీ సర్కారును ఓడించటానికి ప్రజల మధ్య పటిష్టమైన ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఓ వైపు కాంగ్రెస్‌, మరోవైపు కెసిఆర్‌ ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.  2019 లోక్‌సభ ఎన్నికలకు ఇక మరో మూడు నెలల వ్యవధి మాత్రమే వుంది. ఈ దశలో మోడీ ప్రజల విశ్వాసం ఎలా పొందుతారో చూడాలి. –