ఎన్నికల వేళ తగ్గుతూ వస్తున్న పెట్రో ధరలు

7 తరవాత మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన

ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల జరుగుతన్న వేళ వరుసగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో కర్నాటక ఎన్నికల సమయంలోనూ తగ్గిన ధరలు, ఎన్నికలు జరిగిన మరుసటి రోజే పెంచుతూ వచ్చారు. ఇకపోతే మళ్లీ ఎన్నికలు జరిగే డిసెంబర్‌ 7 తరవాత పెరుగుతాయన్న ఆందోళన ఉంది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గడంతో భారత్‌ లో కూడా ఆ ప్రభావం కనిపించింది. గురువారం లీటరు పెట్రోలుపై 41 పైసలు, డీజిల్‌ పై 30 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ధర మార్పు అనంతరం దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 75.97లు కాగా? డీజిల్‌ ధర రూ. 70.97లుగా నమోదు అయింది./ూణిజ్య రంగానికి కేరాప్‌ అడ్రస్‌ అయిన ముంబయిలో పెట్రోలు ధర రూ. 81.50గా, డీజిల్‌ ధర రూ. 64.34లుగా ఉంది. కోల్‌ కతా, చెన్నైల్లో పెట్రోలు ధర వరుసగా రూ. 77.93, రూ. 78.88కి చేరుకోగా? డీజిల్‌ ధర వరుసగా రూ. 72.82, రూ. 74.99కి దిగివచ్చింది. మంగళ, బుధవారాల్లో చమురు ధరలను సవరించలేదు. అమెరికా ఇరాన్‌ పై విధించిన ఆంక్షలను సడలించడంతో క్రూడాయిల్‌ ధరలపై ఒత్తిడి నెలకొని ప్రెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయని విశ్లేషకులు భావిస్తున్నారు.