ఎన్‌డి దళనాయకుడు అరెస్ట్
మహబూబాబాద్,ఆగస్ట్30(జనం సాక్షి): గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ కృష్ణతోపాటు న్యూడెమోక్రసీ దళ నాయకుడు పుల్లన్నను కొత్తగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్నతోపాటు ఆయన భార్య జయక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్న ఎన్‌డీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాతదళ నాయకుడు. ఈ మేరకు పోలీసులు వారిని ఖమ్మం నుంచి కొత్తగూడకు తరలించారు.