ఎన్.ఎస్.ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవా.

ఎన్.ఎస్.ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవా.

బిజినపల్లి,జనంసాక్షి:

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ కి నివాళులుగా ప్రధాని మోడీ పిలుపు మేరకు బిజినపల్లి మండలం పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆద్వర్యంలో అధికారులు సి.నాగరాజు,కె.రామకృష్ణ ల పర్యవేక్షణలో 17 రోజులుగా విద్యార్థులు స్వచ్చత హి సేవా-2023 కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం ముగింపు కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు,చెత్తను, అనవసరపు వ్యర్థాలను తొలగించి కళాశాల పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ విద్యారాణి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు కళాశాలలో ఈ నెల 15 నుండి నేటి వరకు స్వచ్చత హి సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ప్రతి భారతీయ పౌరులు సంవత్సరంలో 100 గంటలు వారానికి రెండు గంటల చొప్పున స్వచ్ఛత పనిని చేపట్టాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంతో జీవిస్తామని తెలిపారు.కావునా విద్యార్థులు ఎల్లప్పుడూ వ్యక్తిగత శుభ్రత పరిసరాలు శుభ్రతను పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సుష్మ,శివ, స్వప్న,రవికుమార్,మనోజ్ కుమార్,హమీద్, యాదగిరి,మహేశ్వర్ జి, అధ్యాపకేతర బృందం కుర్మయ్య,గణేష్,నాగేష్,ఐ.ఇ.సి కన్సల్టెంట్ ఊషన్న,ఎం.ఐ.ఎస్ కన్సల్టెంట్ ఫరూక్ షరీఫ్, పంచాయతీ సెక్రెటరీ చిన్న బీరయ్య, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.