ఎపిలో ఆశవర్కర్ల ఆందోళన

కలెక్టరేట్ల ముట్టడికి యత్నం
విజయవాడల,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ఆశావర్కర్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం పలు జిల్లాల్లో వారు ఆందోళనకు దిగారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు పెంచిన గౌరవ వేతనం మూడువేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ఆశావర్కర్ల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వందలాది ఆశా వర్కర్లు డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల పిలుపుమేరకు మంగళవారం శ్రీకాకుళంలో ఆశావర్కర్లు ‘ చలో కలెక్టరేట్‌ ‘ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తుండగా..ఉద్రిక్తతనెలకొంది. ఆయా ప్రాంతాల్లో ఆశావర్కర్లను ముందస్తుగా పోలీసులు అడ్డగించి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఆశావర్కర్లు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.
ముందస్తు చర్యగా పోలీసులు ఆశావర్కర్లను అరెస్టు చేశారు. తమకు పెంచిన జీతాల జివొ ను విడుదల చేయాలని కోరుతూ..  శ్రీకాకుళం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వెళుతుండగా..ముందస్తుగా పోలీసులు వారిని మార్గమధంలోనే అడ్డగించి అరెస్టు చేశారు. 16 మంది ఆశావర్కర్లను అరెస్టు చేసి సీతంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఆశావర్కర్లు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు పెంచిన గౌరవ వేతనం మూడువేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ఆశావర్కర్ల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. డిమాండ్‌ చేశారు. మండుటెండలో కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.

తాజావార్తలు