ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం
బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్ వద్ద ధర్నా
న్యూఢిల్లీ, అక్టోబర్ 1 (జనంసాక్షి):
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ ప్రభుత్వం రిటైల్ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ తీసుకున్న సంస్కరణలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు దారులు సోమవారం నాడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ చుట్టు ప్రక్కల నుంచి దాదాపు 5వేల మంది సమీకరించారు. అంతేకాకుండా తృణమూల్‌కు చెందిన 10వేల మంది మద్దతుదారులు ఉత్తరప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాలనుంచి తరలి వచ్చారు. ఒక హర్యానా నుంచే 2000మందిని సమీకరించారు. ప్రజల కోసం మేమంటూ… నినదిస్తూ యుపిఎ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిలదీస్తు మమత ఫొటోతో ఉన్న బ్యానర్లను, ప్లకార్డులను చేతబూని, ఢిల్లీ వీదులలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.