ఎమర్జెన్సీ టీమ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 1
రానున్న వర్షాకాలంలో వరద ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని. అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని 27మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాహనాలు అందుబాటులోకి వచ్చాయని బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్పొరేటర్  చింతలశాంతి శ్రీనివాస్ రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండడంతో ఎమర్జెన్సీ టీములు అప్రమత్తంగా ఉండాలని పట్టణాలలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనిఆమెసూచించారు.ఈకార్యక్రమంలోమున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ రాజు, డిఈ లు మహేష్, ప్రశాంతి, కార్తీక్, ఏఈ లు రవళి, లక్ష్మి, అరుణ్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు అనిల్ కిషోర్, ఢిల్లీ పరమేష్, సయ్యద్ మోసిన్, భాస్కర్, శోభన్, విష్ణు, కవిత, ఉదయ, తదితరులు పాల్గొన్నారు.