ఎమ్మెల్యే చొరవతో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా చర్యలు :చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి
)గత కొన్ని రోజులగా వికాస్ నగర్ యూనియన్ బ్యాంకు లైన్ లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ లో డ్రైనేజీ లైన్ డామేజ్ అయి డ్రైనేజీ వాటర్ లీక్ అవుతుందని, చాలా రోజులుగా ఇబ్బంది పడ్తున్నామని కాలనీ సభ్యులు తెలుపగానే స్పందించిన ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలని ఆదేశించడంతో చైతన్యపురి డివిజన్ తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి దగ్గరుండి సమస్య పరిష్కారం చేసేదిశగా పనులు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా వాటర్ వర్క్స్ అధికారులతో పాటు,కాలనీ అధ్యక్షులు పుల్లారెడ్డి, తెరాస నాయకులు కృష్ణ,సంతోష్ యాదవ్,జలంధర్,పులి కిరణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.