ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో గొల్లబస్తికి దారి

20 లక్షల రూపాయల సొంత నిధులతో రోడ్డు వెడల్పు
జులై (జనం సాక్షి)
పటాన్చెరు పట్టణంలోని గొల్లబస్తి లో ఏళ్ల
తరబడి పరిష్కారం నోచుకోని రోడ్డు సమస్యను ఎమ్మెల్యే జిఎంఆర్ పరిష్కరించారు. బస్తీ లోని ఇళ్ళ సముదాయాల మధ్యలో రోడ్డు ఇరుకగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గత 60 సంవత్సరాలుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ విషయమై ఆదివారం ఉదయం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బస్తీ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. రోడ్డు వెడల్పు కోసం స్థల యజమాని బాలరాజుతో చర్చించి, కోల్పోతున్న స్థలానికి 20 లక్షల రూపాయల సొంత నిధులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.