ఎర్రబెల్లి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం
జనగామ,ఆగస్ట్1(జనం సాక్షి): ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి, తొర్రూర్ కేంద్రాలలో నిరుద్యోగ యువతకు ఎస్సై విఆర్‌వో, కానిస్టేబుల్, గ్రూప్-4 ఉద్యోగ పోటీ పరీక్షలకై నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులు ముప్పై రోజులు పూర్తి చేసుకున్నాయి. యువతకు ట్రస్ట్ ద్వారా ఉచిత మద్యాహ్న భోజనాలను అందిస్తూ దాదాపు 1500 విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ అందిస్తున్నారు. దీనికి కృతజ్ఞతగా దేవరుప్పుల మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ఉషాదయకర్ రావుల భారీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమం’ జోగు సోమరాజు’ మండల యూత్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది.