ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు ఆగస్టు 25( జనం సాక్షి)ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గంగోత్రి పాఠశాల ప్రక్కన నూతన ఎలక్ట్రానిక్ బైక్ షోరూంనూ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ముఖ్య అథితిగా హాజరై ప్రారంభిం చారు.ఈ సందర్భంగా నూతనంగా ఎలక్ట్రానిక్ బైక్ షోరూం యజమాన్యం సభ్యులు వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలునుశాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనం శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం అరికట్ట వచ్చిన సూచించారు.అదేవిధంగా అర్థికభారం
కూడా అదికమించవచ్చని వేల్లడించారు.
ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
అనంతరం నూతన ద్విచక్ర వాహనాలను పరిశీలించారు.నూతన ఎలక్ట్రానిక్ బైక్ షోరూం యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ షోరూం యాజమాన్యం
వడ్డే విజయ్ కుమార్.డి. శ్రీనివాస్. నక్కల సురేందర్,నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.