ఎలక్ట్రిక్‌ వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్‌

` రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈవీ కంపెనీల ఆసక్తి
` ఇది తొలి అడుగు మాత్రమే.. రానున్న రోజుల్లో ఈ రంగంలో మరింత అభివృద్ధి
` ఈ మోటార్‌ షో 2023ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎలక్ట్రిక్‌ వాహనాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారనుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్‌ హైటెక్స్‌ లో హైదరాబాద్‌ ఈ మోటార్‌ షో 2023ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం వివిధ ఈవీ కంపెనీల స్టాల్స్‌ విజిట్‌ చేశారు. మోటార్‌ షోలో దేశీయ కంపెనీలు ఈ వెహికిల్స్‌ ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమర్‌ రాజా కంపెనీ ఇప్పటికే ఈవీ బ్యాటరీ మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్టాన్రిక్‌ వెహికిల్స్‌ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కు అవకాశం ఏర్పడిరదని చెప్పారు. ఈ షోలో సిట్రాన్‌ ఎలెక్టిక్ర్‌ కార్‌, క్వాంటామ్‌ ఈవీ బైక్‌, హాప్‌ ఈ బైక్‌ను కేటీఆర్‌ లాంఛ్‌ చేశారు.