ఏనుగుల దాడి నుంచి రక్షించండి
విజయనగరం,అక్టోబర్10(జనంసాక్షి): కొమరాడ మండలం ఆర్తం జంక్షన్‌లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం గుణననపురం దుగ్గి గ్రామల రైతులు రాస్తారోకో చేశారు. ఇటీవల ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని పంటలు నాశనమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి గ్రామంలో భయాందోళనలకు గురి చేస్తున్న ఏనుగులను తరలించాలంటూ.. 2 గంటల సేపు అంతర్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. పంటలు నాశనమై నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జంక్షన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేయడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో స్థలానికి పిపిఎ ఆర్‌డిఒ, ఎంఆర్‌ఒ, అడవి అధికారులు వచ్చి రైతులతో మాట్లాడి హావిూ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు.