ఏపీలో 14 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
టిటిడి సెక్యూరిటీకి కర్నూల్ ఎస్పీ గోపీనాధ్ జెట్టీ బదిలీ
సిఎం సొంత జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుకు గుంటూరు
అమరావతి,అక్టోబర్23(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. మొత్తం ఇలా 14మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్ ఎస్పీ గోపినాథ్ జెట్టికి టిటిడి సెక్యూరిటీ, విజిలెన్స్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్‌కు గుంతకల్ రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న రవీంద్రనాధ్ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్ బాధ్యతలు అప్పగించారు. కడప ఎస్పీ బాబూజీ అట్టాడను విశాఖ రూరల్ ఎస్పీగా మారుస్తూ బదిలీ చేశారు. సిఎం సొంత జిల్లా చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబును గుంటూరు రూరల్ ఎస్పీ మార్చారు. విశాఖ రూరల్ అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్ డిసిపి ఫకీరప్పను కర్నూల్ ఎస్పీగా బదిలీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కడప జిల్లా ఎస్పగా బదిలీ చేశారు. పార్వతీపురం ఓఎస్డీ విక్రాంతి పాటిల్‌ను చిత్తూరుకు, చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌ను తిరుపతి అర్బన్ ఎస్పీగా, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను విశాఖ సిట్‌కు, గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్ ఆర్డర్ కు బదిలీ అయ్యారు. అదేవిధంగా నెల్లూరు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు బదిలీ చేశారు. కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్‌కు బదిలీ అయ్యారు. ఇలా మొత్తం 14మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.