ఏలేరు కాలువ ఆధునీకరణకు చర్యలు 

కాకినాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  ఏలేరు కాలువల ఆధునీకరణకు సంబంధించి అన్ని గ్రామాల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఏడీబీ రోడ్డు విస్తరణ భూసేకరణ సర్వే పూర్తి చేశారని, ప్రిలిమినరీ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు.జిల్లాలో మైదాన ప్రాంతంలో చేపట్టిన ప్రజాసాధికార సర్వేపై జేసీ వివరించారు. ఏజెన్సీలో నెట్‌వర్క్‌ సమస్య ఉన్నందున ఆఫ్‌లైన్‌లో సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మిగతా మండలాల్లో వివరాలు సర్వే నమోదు చేయటానికి గుర్తించామన్నారు. పట్టణాల్లో సర్వే మందకొడిగా ఉందని, వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆయన ఆదేశించారు. అదనపు ఎన్యుమరేటర్లను నియమించాలని, అవసరమైన ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ నమోదు పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

తాజావార్తలు