ఐఆర్ జీఓను సవరించాలి

ఐఆర్ జీఓను సవరించాలి

టేకులపల్లి, అక్టోబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో 159,133 ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ,ఉద్యోగులకు రెండవ పిఆర్సిలో భాగంగా పిఆర్సి కమిషన్ వేస్తూ 5 శాతం ఐఆర్ ఇస్తున్నట్టుగా ప్రకటించడం రాష్ట్రంలోని సమస్త ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్లను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల కోయగూడెంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం గత పి.ఆర్.సికు సంబంధించిన 15 వాయిదాల ఏరియర్స్ను నేటికీ జమ చేయలేదని,మూడు పెండింగ్ డిఏలను విడుదల చేయలేదని,రాష్ట్రంలో అన్ని రకాల ధరలు మండిపోతున్న సందర్భంలో, ద్రవ్యోల్పణంను, ధరలసూచికను పరిగణలోకి తీసుకొని కనీసం 18 శాతం ఐఆర్ ప్రకటించవలసి ఉండగా కేవలం 5శాతం ఐఆర్ ఇవ్వడమనేది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని,రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను సవరించి జూలై నెల నుండి 18 శాతం ఐఆర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా తెలంగాణ బిడ్డలేనని,వారి సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలు,కమిట్మెంట్లు,ఇతర రాష్ట్రాల ఉద్యోగుల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పరిగణలోకి తీసుకొని ఫిట్మెంట్ ను రికమెండ్ చేయాలని పిఆర్సి కమిషన్ను ఆదేశించడం సరైనది కాదని,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కూడా ఐఆర్ వర్తించే విధంగా జీవోను సవరించి వెంటనే 18 శాతం ఐఆర్ ను ప్రక