ఐడిఎఫ్ సి బ్యాంకులోఐడిఎఫ్ సి బ్యాంకులో మూడు నిమిషాల్లోనే ఖాతా ఓపెన్

జీవితాంతం ఉచితంగా క్రెడిట్ కార్డ్ సేవలు : సులభంగా రుణాలుబ్యాంకు సౌత్ హెడ్ కిషోర్ కుమార్
మిర్యాలగూడ, జనం సాక్షి. వినియోగదారులకు మరింత చేరువ లో ఐఎఫ్ డిసి బ్యాంక్ కార్యకలాపాలు  కొనసాగిస్తుందని బ్యాంక్ సౌత్  హెడ్  కిషోర్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణములోని రెడ్డి కాలనీలో గురువారం  ఐఎఫ్ డిసి బ్యాంక్ 25వ శాఖను ప్రారంభోత్సవ సందర్భంగా  స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 657 బ్రాంచీలు కలిగి,650 ఏటీఎం లు, కలిగి ఉన్నారని పేర్కొన్నారు.1 లక్ష.25 వేల కోట్ల డిపాజిట్ల రూపంలో  1 లక్ష,52 వేల కోట్ల రూపాయలను అడ్వాన్సులుగా స్వీకరించడం జరిగిందని వివరించారు. తమ బ్యాంకులో  ఖాతాదారులకు సంబంధించిన 28 సేవలకు   ఉచితంగా సేవలందిస్తున్నామని, బ్యాంకులో నూతన ఖాతాలు తెరవడానికి  కేవలం 3 నిమిషాల వ్యవధిలో  ఖాతా ప్రారంభిస్తామని, తెలిపారు. క్రెడిట్ కార్డు సేవలు జీవితాంతం ఉచితంగా పొందవచ్చునని పేర్కొన్నారు.చిరు వ్యాపారుల దగ్గర నుండి  పరిశ్రమల వరకు  రుణాల మంజూరి  త్వరితగతిన   చేపడతామని అన్నారు. బ్యాంకు నుండి డిజిటల్ కరెన్సీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు మాట్లాడుతూ వినియోగదారులకు బ్యాంకులో  సౌకర్యాలు కల్పించాలన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ మాట్లాడుతూ రైతులకు, చిరు వ్యాపారస్తులకు రుణాలు మంజూరిలో ఇబ్బందులు రాకుండా త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. బ్యాంకు అందిస్తున్న సేవలను బట్టి ఖాతాదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. పేస్టిసైడ్ ఫెర్టిలైజర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు మాట్లాడుతూ ఖాతాదాలకు నాణ్యమైన సేవలందించి మన్ననలు పొందాలన్నారు. క్లాత్ అసోసియేషన్ జిల్లా నాయకులు నీలా మోహన్ రావు, బిజెపి రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు,ఐఎఫ్ డిసి జోనల్ హెడ్ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర హెడ్. రమేష్  కొప్పోలు, చీఫ్ మేనేజర్ సందీప్, బ్రాంచ్ మేనేజర్ ప్రభుదేవ తదితరులు పాల్గొన్నారు.