ఐదేళ్లయినా హావిూలకు అతీగతీ లేదు

అందుకే మళ్లీ రామాలయ అంశం నెత్తికెత్తుకున్నారు

బిజెపిపై మండిపడ్డ మాయావతి

లక్నో,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఐదేళ్లు కావస్తున్నా ప్రధాని మోడీ ఇచ్చిన హావిూల్లో కనీసం 50శాతం కూడా అమలు కాలేదని బీఎస్పీ నేత మాయావతి అన్నారు. ఇంతకాన్నా దారుణం మరోటి ఉంటుందా అని వనివారం నాడిక్కడ విూడియాతో మాట్లాడుతూ అన్నారు. కేంద్రంలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అయిదేళ్లు అవుతున్నదని, కొన్ని నెలల్లోనే మళ్లీ సాధారణ ఎన్నికలు రానున్నాయని, బీజేపీ తన వాగ్దానాలను కనీసం 50 శాతం కూడా పూర్తి చేయలేదని మాయావతి తెలిపారు. వాగ్దానాలు 50 శాతం కూడా పూర్తి కాలేదని ప్రధాని మోదీకి కూడా తెలుసు అని మాయావతి అన్నారు. మళ్లీ అధికారంలోకి రామన్న విషయం వాళ్లకు కూడా తెలుసన్నారు. ప్రభుత్వం విఫలం కావడం వల్లే, అయోధ్య రామ మందిర అంశాన్ని లేవనెత్తుతున్నారని మాయావతి తెలిపారు. ఒకవేళ బీజేపీకి ఆలయ నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంటే, వాళ్లు అయిదేళ్లు వేచి చూడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీకి తోడుగా శివసేన, వీహెచ్‌పీ కూడా తమ కుట్రను బయటపెడుతున్నాయని మాయావతి ఆరోపించారు. ఎన్నికల ముందు రామలయం అంశాన్ని నెత్తికెత్తుకోవడం వారికి పరిపాటే అన్నారు. ప్రజలు ఇలా రెచ్చగొట్టి లబ్దిపొందలేరని అన్నారు.