ఒకే లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం

` ఇందుకు కెసిఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ
` గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
` ప్రత్యేక ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు
` గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్‌ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడిరచారు. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ విూట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు. ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్‌ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని చెప్పారు. చాలా ఎత్తుకు ఎదగాలని కలలు కనాలని, అలాంటివారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్‌ మిల్‌ పెట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా వాటర్‌వర్క్స్‌లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చామని వెల్లడిచారు. ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసేవాళ్లకు పోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్‌ విూట్‌ జరుపుకుందాని చెప్పారు. గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ వల్లే ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్‌ తయారవుతున్నారని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి కేసీఆర్‌ అన్నివిధాలు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అనే పార్టీలు, ప్రభుత్వాలను చూశామని గిరజనులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో గిరుజనులు అభివృద్ధి చెందారని తెలిపారు.