ఒక్కరోజుతో ఉద్యమం ఆగదు
ఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద విపక్షాల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయాలతో కాంగ్రెస్‌పార్టీకే నష్టమని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అత్యవసర పరిస్థితుల కన్న దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టితో ఉద్యమం ఆగదని, కేంద్రం వెనక్కి తగ్గేవరకు పోరు కొనసాగిస్తామన్నారు. రేపు మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ అన్నారు.