ఒక్కేసి పువ్వేసి వేసి చందమామ

ఘట్కేసర్ సెప్టెంబర్ 26 జనం సాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పూలను పూజించే అరుదైన పండుగలో భాగంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరం ఆదివారం ప్రారంభమైంది అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకునే ఎంగిలిపువ్వు బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి ఆడారు రాజధాని నగరం తో పాటు అన్ని జిల్లాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలు ఆటలు ఆడరు బతుకమ్మ పాటలతో వాడాలన్నీ దద్దరిల్లాయి. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో అదేవిధంగా పలు వార్డుల్లో మహిళల తో కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకున్న ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముందుగా ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా 16వ వార్డు మహిళలకు ఎంగిలి పులా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం దైవాన్ని పూలతో పూజించడం అందరికి అలవాటు. కానీ.. పూలనే దైవంగా భావించి ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం. తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగ,ఎంగిలిపూల వేడుకతో నేడు మొదలైంది. పండుగ కోసం పుట్టిళ్లకు చేరిన ఆడపడుచులతో చదువు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా వెళ్లిన వారి రాకతో రాష్ట్రంలో ప్రతి ఇంటా సందడి మొదలైంది. ఎంగిలిపూలతో ఆదివారం ప్రారంభమైన ఈ సంబురం తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది. ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలవుతుందని తెలిపారు. అనంతరం వార్డు లోని మహిళల తో, చిన్నారులతో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజాలు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.