ఓటమి లోతుల్లోంచి పుట్టినది జనసేన: పవన్
శ్రీకాకుళం,అక్టోబర్19(ఆర్‌ఎన్‌ఎ): ఓటమి లోతుల్లో నుంచి ఉదయించిన పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో పలువురు నేతలు శుక్రవారం అధ్యక్షుడు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు పుట్టిన పార్టీ జనసేన అని తెలిపారు. తన పార్టీ కుల రాజకీయాలు చేసేది కాదని, కులాలను కలిపే పార్టీ అని పేర్కొన్నారు. యువతను మేల్కొలిపేందుకు, మార్పు కోసమే వచ్చామని, దాని కోసం మరో కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నామన్నారు.