ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం హిమాయత్‌ సాగర్‌ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.